PM Internship Scheme 2024 Benefits: 85000 ఖాళీలు, పీఎం ఇంటర్న్షిప్ పథకం అవకాశం కోసం నమోదు చేసుకోండిలా.

pm-internship-scheme-registration-official-website
Telegram Channel Join Now
5/5 - (1 vote)

PM Internship Scheme 2024: PM ఇంటర్న్షిప్ పథకానికి దరఖాస్తు రిజిస్ట్రేషన్ చేసుకొనే అవకాశం అందుబాటులోకి వచ్చింది. విద్యార్థులు, మరియు అర్హులైన ఆసక్తి కలవారు ఈ పథకానికి ఆన్లైన్లో అప్ప్లై చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో వేల సంఖ్యలో ఇంటర్న్షిప్ అవకాశాలు ఉన్నాయి. మీకు ఆసక్తి ఉన్నట్లయితే వెంటనే ఈ ఇంటర్న్షిప్ స్కీంకి అప్ప్లై చేసి అవకాశం పొందండి.

PM Internship Scheme 2024 Registration Date, Benefits, Last Date, Application Form, Website/Portal in Telugu

కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Corporate Affairs -MCA) ప్రధాన మంత్రి ఇంటర్న్షిప్ స్కీం (PMIS)ను October 12న ప్రారంభించి, రిజిస్ట్రేషన్ అవకాశాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచింది. వివిధ వ్యాపార, వాణిజ్య మరియు ఇతర రంగాలలో ఇంటర్న్షిప్పులు అందించటం ద్వారా యువతకు వాస్తవ ప్రపంచ వృత్తి, వ్యాపార అనుభవం మరియు నైపుణ్యాలను మెరుగు పరిచి వారికి ఉద్యోగావకాశాలు పెంపొందించడమే ఈ పథకం యొక్క లక్ష్యం.

ఈ పీఎం ఇంటర్న్షిప్ పథకానికి అప్ప్లై చేసుకొనేందుకు, కావలసిన అర్హతలు, దరఖాస్తు మరియు ఎంపిక ప్రక్రియ, ఇందులో పాల్గొనే కంపెనీల వివరాలను క్రింద పొందుపరచాము చూడండి.

pm-internship-scheme-registration-official-website
PM Internship Scheme Registration Official Website

పీఎం ఇంటర్న్షిప్ స్కీం 2024 రిజిస్ట్రేషన్ డేట్/దరఖాస్తు తేదీ, చివరి తేదీ, దరఖాస్తు ఫారం, ఎంపిక విధానం, వెబ్సైటు వివరాలు

పీఎం ఇంటర్న్షిప్ పథకం కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనే వీలు కల్పించింది కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆసక్తి ఉన్నవారు అధికారిక వెబ్సైట్ https://www.pminternship.mca.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ ద్వారా ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు మరియు అప్లికేషన్లు సబ్మిట్ చేయవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తి అయిన అభ్యర్థులు అనగా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు తమ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీ (Email ID) కి లేదా మొబైల్ నెంబర్ (Mobile Number) ద్వారా అందుబాటులో ఉన్న ఇంటర్న్షిప్ అవకాశాల గురించి నోటిఫికేషన్లు అందుకుంటారు.

ALSO READ  Rajasthan CET 12 Level Admit Card 2024 Download By Name Wise and Roll Number Wise @rsmssb.rajasthan.gov.in 

పీఎం ఇంటర్న్షిప్ కి కావలసిన అర్హతలు

పీఎం ఇంటర్న్షిప్ స్కీం 2024కి అప్లై చేసుకోవాలనుకొనే అభ్యర్థులు క్రింద పేర్కొన్న అర్హతలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్థుల వయసు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
విద్య: పోస్ట్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు, డిప్లొమాతో సహా వివిధ విద్యా నేపధ్యాలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
నైపుణ్యాలు: ఈ పథకం కింద వివిధ ఫంక్షనల్ ఏరియాల్లో ఇంటర్న్షిప్లు అందుబాటులో ఉన్నాయి. కావున, అభ్యర్థులు తమ విద్యార్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా తాము ఆన్లైన్లో అప్లికేషన్లు సమర్పించవచ్చు.
జాతీయత: ఈ పథకం భారతీయులకు మాత్రమే ఉద్దేశించబడింది.

పీఎం ఇంటర్న్షిప్ పథకానికి దరఖాస్తు చేసుకొనే విధానం

క్రింద పేర్కొన్న విధంగా Stepsని ఫాలో అయ్యి ఆన్లైన్లో రిజిస్టర్ అయి అప్లికేషన్ ని సమర్పించండి.

  1. పీఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రాం అధికారిక వెబ్సైట్ https://www.pminternship.mca.gov.inను ఓపెన్ చేయండి.
  2. రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేసి ఆ తరువాత వచ్చే రిజిస్ట్రేషన్ ఫారం నందు మీ వ్యక్తిగత, విద్య, వృత్తిపరమైన వివరాలను నింపాలి.
  3. ఫారం నింపిన తరువాత సబ్మిట్ చెయ్యాలి. మీరు అందించిన సమాచారం ఆధారంగా పోర్టల్ ఒక రెజ్యూమెను జనరేట్ చేస్తుంది.
  4. లొకేషన్, సెక్టార్, ఫంక్షనల్ రోల్, మరియు క్వాలిఫికేషన్స్ ని బట్టి అయిదు ఇంటర్న్షిప్ ఆప్షన్లను ఎంచుకోవాలి.
  5. అప్లికేషన్ సబ్మిట్ చేసి, కంఫర్మ్ పేజీని డౌన్లోడ్ చేసుకోండి.

ఎన్ని కంపెనీల్లో అవకాశాలు ఉన్నాయో తెలుసుకోండి…

పీఎం ఇంటర్న్షిప్ స్కీం – 2024 (PM Internship Scheme 2024) లో కోకాకోలా, డెలాయిట్, అదానీ గ్రూప్, రిలయన్స్ గ్రూప్, హెచ్.
డి.ఎఫ్.సి, జుబిలంట్ ఫుడ్ వర్క్స్ , ఐచర్ మోటార్ లిమిటెడ్, టెక్ మహీంద్రా, మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్, లార్సెన్ & టూబ్రో లిమిటెడ్, బజాజ్ ఫైనాన్స్, ముతూట్ ఫైనాన్స్ లాంటి 500లకు పైగా ప్రముఖ కంపెనీలు ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించనున్నాయి. రానున్న ఐదు సంవత్త్సరాల్లో 1 కోటికిపైగా ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ పథకానికి రూపకల్పన చేయడం జరిగింది. ఇప్పటివరకు మొదటి దశలో 80000 పైచిలుకు అవకాశాలకు గాను 155000 మంది పైచిలుకు అభ్యర్థులు నమోదు చేసుకోవడం జరిగింది.

ఈ పథకం ప్రత్యేకతలు

మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు కన్స్ట్రక్షన్, ఎనర్జీ, ఆయిల్ మరియు గ్యాస్, బ్యాంకింగ్ మరియు ఫైనాన్సియల్ సర్వీసెస్, ఏవియేషన్ మరియు డిఫెన్స్, ట్రావెల్ మరియు హాస్పిటాలిటీ వంటి రంగాలలో ఇంటర్న్షిప్ లు అందుబాటులో ఉన్నాయి. ఈ అవకాశాలు దేశవ్యాప్తంగా 737 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయని పోర్టల్ చూపించింది. ఉత్పత్తి, అమ్మకాలు, నిర్వహణ, మార్కెటింగ్ మరియు మార్కెటింగ్ కార్యకలాపాల నిర్వహణ వంటి రంగాలను కవర్ చేస్తుంది.

ALSO READ  Army MES Recruitment 2024 [41822+ Posts]: Apply Online, Last Date PDF Download, Check Notification, Exam Fee, Age Limit, Height Limit, Eligibility & Salary

ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం కోసం ప్రభుత్వంతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ మరియు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ లు జత కట్టాయి, ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యానికి ఇదొక ఉదాహరణ. దీనివలన దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగావకాశాల కోసం ప్రయత్నిస్తున్న మరియు ప్రస్తుతం చదువుకుంటున్న యువకులను, ప్రతిభ కోసం వెతుకుతున్న వ్యాపార సంస్థలకు కనెక్ట్ చేయడంలో ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది.

ప్రస్తుతం ఆర్ధిక వ్యవస్థలో ఉద్యోగాల కల్పనలో ఎక్కువ వర్కింగ్ వయసు జనాభా అవసరానికి తగినంతగా లేకపోవడంపై ఆందోళనల మధ్య ఈ పథకం ప్రారంభించటం జరిగింది.

పీఎం ఇంటర్న్షిప్ పథకం ప్రయోజనాలు

ఈ పథకం కింద ఇంటర్న్షిప్ అవకాశం పొందినవాళ్లు ప్రభుతం నుండి నెలవారీగా ₹4,500 మరియు కంపెనీ నుండి ₹500 నెలవారీ సహాయం పొందుతారు, అలాగే వారికి మద్దతుగా ప్రభుత్వం నుండి ₹6,000 ఒకేసారి మంజూరు చేస్తారు. కంపెనీలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల నుండి నెలవారీగా అందించే శిక్షణ ఇంటర్న్‌ల ఖర్చుతో పాటు ప్రతి ఇంటర్న్‌కు ₹500 చెల్లించడానికి అనుమతించబడతాయి.

జాయిన్ అయిన ప్రతి ఇంటర్న్ కి ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన మరియు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద బీమా కవరేజీ సదుపాయం వర్తిస్తుంది.

ముగింపు: ఈ వ్యాసం మీకు నచినట్లైతే మరియు ఇంకా మేము ప్రచురించబోయే ఉద్యోగ ఉపాధి అవకాశాల సమాచారం కోసం క్రింద ఇవ్వబడిన టెలిగ్రామ్ (Telegram) ఛానల్ లో జాయిన్ కాగలరు. పలువురి వృత్తి మరియు ఉపాధికి ఉపయోగకరమైన ఈ వ్యాసాన్ని మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో మరియు పేజీ లలో షేర్ చెయ్యండి. ఆలా చేస్తే మీవలన కొందరికి అయినా సహాయం చేసిన వాళ్ళు అవుతారని గమనించగలరు. ఈ టాపిక్ కి సంబంధించిన విషయాలు లేదా ఏవైనా సందేహాలు, సలహాలు మరియు సూచనలు ఉంటె క్రింద కామెంట్ సెక్షన్ లో తెలుపగలరు. ఇంకా మీకు ఏమేం టాపిక్స్ ఈ వెబ్సైటు నుంచి ఆశిస్తున్నారో తెలుపగలరు వీలైనంత మేరకు మేము మీ కామెంట్స్ కి రిప్లైలు ఇచ్చి మీ సందేహాలను నివృత్తి చేయగలమని ఆశిస్తున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *