NMDC Junior Officer Recruitment Hyderabad: ప్రభుత్వ సంస్థలో 153 జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలు, ఖాళీలు,అర్హత వివరాలు. అప్లై చేసుకోండిలా.

NMDC Junior Officer Recruitment
Telegram Channel Join Now
4/5 - (1 vote)

NMDC Hyderabad: తెలంగాణ ఎన్ఎండిసి భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయినది. సంస్థలోని పలు విభాగాలలో ఖాళీగా ఉన్న 153 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రకటన విడుదల అయినది. క్రింద మేము పొందుపర్చిన వివరాలు చూసి తెలుసుకోగలరు…

NMDC Junior Officer Recruitment 2024 Notification Telugu

NMDC Junior Officer Recruitment - టీజీ ఎన్‌ఎండీసీ రిక్రూట్‌మెంట్‌ 2024
NMDC Junior Officer Recruitment

తెలంగాణా రాష్ట్రం – హైదరాబాద్ (Hyderabad) మాసాబ్ ట్యాంక్ నందు గల నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC) లో జూనియర్ ఆఫీసర్ పోస్టుల ఖాలీలు భర్తీ చేయటానికి దరఖాస్తులను కోరుతుంది. మొత్తం 153 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది సంస్థ. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలను సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ https://www.nmdc.co.in/ లో పొందుపరిచారు..

ఖాళీల సంఖ్య: మొత్తం 153 జూనియర్ ఆఫీసర్ (ట్రైనీ) పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు: మైనింగ్‌- 56, ఎలక్ర్టికల్‌-44, మెకానికల్- 20, సివిల్-09, సర్వే-09, కమర్షియల్-04, కెమికల్- 04, జియో అండ్ క్వాలిటీ కంట్రోల్-03, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్- 03, ఎన్విరాన్‌మెంట్-01 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: పోస్టులకు అనుకూలంగా తగిన విద్యార్హతలు అనగా సంబంధిత విభాగాల్లో డిప్లొమా, సీఏ/ఐసీఎంఏ, డిగ్రీ/ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ (ఎంబీఏ) ఉత్తీర్ణత మరియు పని అనుభవం కూడా ఉండాలి.

నోటిఫికేషన్ వివరాలు

ఇతర సమాచారం మరియు ముఖ్య వివరాలు

వయోపరిమితి: 32 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు వర్తిస్తుంది.
స్టైపెండ్: నెలవారీగా రూ.37,000 – రూ. 1,30,000 వరకు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము: రూ.250. ఎస్సీ/ఎస్టీ/పీడబ్లూబీడీ/ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం/ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అన్ని టెస్టుల్లోనూ మరియు ఇంటర్వ్యూ నందు ప్రతిభ కనబర్చిన వారిని ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 10, 2024.

Also Read: PM Internship Scheme registration 2024, apply online, stipend, last date, portal details in Telugu

ALSO READ  Army MES Recruitment 2024 [41822+ Posts]: Apply Online, Last Date PDF Download, Check Notification, Exam Fee, Age Limit, Height Limit, Eligibility & Salary

ఉత్తర్వులు జారీ చేసిన ఆరుగురు సభ్యులతో కూడిన విద్యా కమిషన్ సలహా కమిటీ

తెలంగాణ ప్రభుత్వం విద్య, ఉద్యోగ నియామకాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న క్రమంలో విద్యా కమిషన్ ను నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిషన్ కు విధానపరమైన నిర్ణయాలు మరియు ఇతర అంశాల్లో సహకరించేందుకు గాను ఆరుగురు సభ్యులతో కూడిన సలహా కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో సభ్యులుగా ఆచార్య జి. హరగోపాల్, ఆచార్య కె. మురళి మనోహర్ (కేయూ, విశ్రాంత), ఆచార్య కె. వెంకటనారాయణ (కేయూ, విశ్రాంత), ఆచార్య సూరేపల్లి సుజాత (శాతవాహన వర్సిటీ), ఆర్. వెంకట్ రెడ్డి (ఎంవీ ఫౌండేషన్ జాతీయ కన్వీనర్), కె.ఎం. శేషగిరి (యూనిసెఫ్, విద్యనిపుణుడు) నియమితులయ్యారు.

వివిధ రంగాలలో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల ప్రకటనలు మరియు సమాచారం కోసం All Jobs Adda Telugu వెబ్సైటు యొక్క టెలిగ్రామ్ ఛానల్ నందు జాయిన్ అవ్వగలరు. మీకు ఏదైనా విద్య, ఉద్యోగ, ఉపాధి మరియు ఏ ఇతర రంగాలలో సలహాలు కావలసిన యెడల, మాకు ఏవైనా సూచనలు చేయాలనుకున్న టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు. క్రింద కామెంట్ సెక్షన్ ద్వారా మీరు ఏదైనా కామెంట్ చెయ్యగలరు. ఈ ఉపయోగకరమైన పోస్టు ని మీ కుటుంబ సభ్యలకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు Social Media లో షేర్ చెయ్యగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *