AP Outsourcing Jobs 2025: 10th అర్హతతో AP జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు

Telegram Channel Join Now
Rate this post

AP Outsourcing Jobs 2025 Notification, Apply Online, Salary, PDF in Telugu:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా కలెక్టరు గారి ఆదేశాల మేరకు హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి 61 అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకొనుటకు నోటిఫికేషన్ విడుదల అయినది. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ – 2, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ ఖాళీల నియామకంకై అప్లికేషన్లను కోరుతున్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ తోపాటు డిప్లొమా లేదా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ డిగ్రీ పూర్తి చేసినవారు ఈ ఉద్యోగాలకు అర్హులుగా నిర్ణయించటం జరిగింది మరియు ఇచట పేర్కొనబడిన అర్హతలు ఉన్నవారు అప్లై చేసుకొని ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగినవారు మరియు నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకొని అర్హులు అయినచో దరఖాస్తు చేసుకోగలరు.

అప్లికేషన్ కి కావాల్సిన సర్టిఫికెట్స్ (Certificates Requirement):

  • సంబంధిత వివరములతో పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
  • SSC/ ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్ ఉండాలి
  • 4th నుండి 10th వరకు స్టడీ సర్టిఫికెట్స్
  • కుల ధ్రువీకరణ పత్రం.

You may also like:

పోస్టుల వివరాలు, మరియు వాటి అర్హతలు (AP Outsourcing Jobs 2025 Eligibility Criteria):

ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ వారు ఈస్ట్ గోదావరి జిల్లాలోని ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నందు 61 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసారు. ఇందులో ల్యాబ్ టెక్నీషియన్, FNO, వాచ్మెన్ ఉద్యోగాలు ఉన్నాయి. 10th, ఇంటర్మీడియట్ తో పాటుగా MLT లో డిప్లొమా లేదా డిగ్రీ చేసినవారు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ALSO READ  Rajasthan CET 12 Level Admit Card 2024 Download By Name Wise and Roll Number Wise @rsmssb.rajasthan.gov.in 

ఉద్యోగ నియామక ప్రక్రియ (సెలక్షన్ ప్రాసెస్):

దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి ఎలాంటి రాత పరీక్ష ఉండదు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఉద్యోగ అర్హులను మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగులను నియమిస్తారు. మెరిట్ లిస్ట్ ద్వారా ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి అయినా తరువాత జిల్లా మెడికల్ డిపార్ట్మెంట్ లో పోస్టింగ్ ఇస్తారు.

ఉద్యోగాల కోసం అభ్యర్థుల వయోపరిమితి వివరాలు:

ఈ ఉద్యోగాలకు (Jobs) దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థులు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఉండాలి. SC, ST, EWS, OBC కి చెందిన అభ్యర్థులకు మరో 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

శాలరీ వివరాలు :

అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు శాలరీ వారు పొందిన పోస్టులను అనుసరించి అందిచడం జరుగుతుంది. వీరికి రూ.₹15,000/- నుండి ₹32,600/- వరకు జీతాలు ఉంటాయి. ఇతర అలవెన్సులు ఏవీ కూడా ఈ ఉద్యోగాలకు లభించవు.

ఉద్యోగాల నియామకపు ప్రక్రియకు సంబందించి ముఖ్యమైన తేదీలు:

ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ కార్యాలయం అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు క్రింద పేర్కొనబడిన తేదీలో దరఖాస్తు చేసుకోవాలి. కావున ఎంపిక ప్రక్రియలోని ముఖ్యతేదీలను క్షుణ్ణంగా పరిశీలన చేసి తగు సూచనలను గమనించి మరియు వాటికి అనుగుణంగా మీరు వాటికీ అనుగుణంగా తగు కార్యాచరణను చేపట్టవలసి ఉంటుంది.

  • దరఖాస్తుల (అప్లికేషన్ల) స్వీకరణ ప్రక్రియ ప్రారంభ తేదీ 6th జనవరి 2025
  • దరఖాస్తుల (అప్లికేషన్ల) స్వీకరణ ఆఖరు తేదీ 20th జనవరి 2025
  • ప్రోవిషనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ 28th జనవరి 2025
  • ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ 5th ఫిబ్రవరి 2025
  • అపాయింటుమెంట్ ఆర్డర్స్ ఇచ్చే తేదీ 15th ఫిబ్రవరి 2025

అప్లికేషన్ ఫీజు వివరాలు:

ఈ క్రింద తెలిపిన విధంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు పొదలనుకుంటున్న అభ్యర్థులు District Medical & Health Officer పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ తీసి అప్లికేషన్ ఫారంతో జతపరిచి గడువులోగా పంపించవలసి ఉంటుంది.

  • OC, OBC అభ్యర్థులకు : ₹500/- ఫీజు
  • SC, ST, PHC అభ్యర్థులకు : ₹200/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

అప్లికేషన్ ప్రక్రియ మరియు రిక్రూట్మెంట్ యొక్క పూర్తి వివరాలు:

రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలకు సంబంధిత నోటిఫికేషన్ పిడిఎఫ్ (PDF) లేదా ఆఫీషియల్ వెబ్సైట్ లింక్స్ ఇక్కడ పొందుపరచాము, చూడగలరు. అలాగే, పూర్తి సమాచారం తెలుసుకొన్న తరువాత అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

ALSO READ  Army MES Recruitment 2024 [41822+ Posts]: Apply Online, Last Date PDF Download, Check Notification, Exam Fee, Age Limit, Height Limit, Eligibility & Salary

పైన ఇవ్వబడిన లింక్ ద్వారా దరఖాస్తు సమర్పించగలరు.

ముఖ్యగమనిక: ఆంధ్రప్రదేశ్ (AP) అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబందించిన జిల్లా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *