All Jobs Adda Telugu

IBPS SO Mains Admit Card 2024 (896 SO Posts): ఐబీపీఎస్‌ స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ మెయిన్‌ ఎగ్జామ్‌ కాల్‌ లెటర్‌ విడుదల

Rate this post

IBPS SO Mains Admit Card 2024 Download: ఐబీపీఎస్‌ స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ (SO) పోస్టుల భర్తీ కొరకు మెయిన్స్ ఎగ్జామ్‌ను డిసెంబర్‌ 14న నిర్వహించనున్నారు. కాగా ఈ పరీక్షకు సంబంధించిన కాల్‌ లెటర్లు విడుదలయ్యాయి.

IBPS SO Mains Admit Card / Call Letter 2024

ఇటీవల ఇన్స్టిట్యూట్ అఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) ఉద్యోగ ఖాళీలు భర్తీ ప్రక్రియ వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే వరుస నోటిఫికేషన్లు విడుదల చేసి ఉద్యోగ నియామకాల్లో జోరు కనబరుస్తోంది. ఆగష్టు నెలలో వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (సీఆర్పీ ఎస్పీఎల్-XIV) ఉద్యోగాలను భర్తీ చేయటం కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విదితమే.

మొత్తం 896 స్పెషలిస్ట్ ఆఫీసర్ (Specialist Officer) ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఈ మొత్తం ఖాళీల్లో వివిధ విభాగాలు అనగా ఐటీ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, రాజ్భాష అధికారి, లా ఆఫీసర్, హెచ్ఆర్/పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ ఖాళీలు భర్తీ చేయనున్నారు. నవంబర్ 9వ తేదీన ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించి ఫలితాలు కూడా విడుదల చేసింది.

ఎంపిక ప్రక్రియ

ఉద్యోగ అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు, మరియు ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అయితే… ఈక్రమంలో తాజాగా మెయిన్స్ ఎగ్జామ్ కాల్ లెటర్ విడుదల చేసింది. ఈ పరీక్షకు అర్హత సాధించిన వారు అధికారిక వెబ్సైటు నుంచి రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్/పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి పరీక్ష కేంద్రం వివరాలను తెలుసుకోగలరు మరియు కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోగలరు.

ఇక IBPS SO Mains పరీక్ష December 14వ తేదీన నిర్వహించనున్నారు. IBPS SO Call Letter డౌన్లోడ్ చేసుకోదలచుకునేవారు ఈ అధికారిక వెబ్సైటు URL/డైరెక్ట్ లింక్ ని ఇక్కడ పొందుపరచాము చూడగలరు. ఈ మెయిన్స్ పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి అర్హత సాధించిన వారికీ ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారి తుది జాబితా విడుదల చేస్తారు.

భర్తీ చేయనున్న మొత్తం ఖాళీలు మరియు వివిధ విభాగాల వారీగా వివరాలు

మొత్తం ఉద్యోగాల సంఖ్య – 896

రిక్రూట్మెంట్లలో పాల్గొనే బ్యాంకుల వివరాలు

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ అండ్‌ సింధ్ బ్యాంక్‌లలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ (SO) ఖాళీలను భర్తీ చేయనున్నారు.

అయితే… ఇటీవలి కాలంలో బ్యాంకు ఉద్యోగాల భర్తీకి సంబంధించి వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్న విషయం విదితమే. కావున విద్యార్థులు, నిరుద్యోగులు మరియు ఉద్యోగార్థులు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగము చేసుకోగలరు.

ఈ ఉపయోగకరమైన ఆర్టికల్ ని మీ బంధు మిత్రులకు శ్రేయోభిలాషులకు Social Media ద్వారా Share చేసి వారికి తెలియజేయగలరని ఆశిస్తున్నాము. ఈ ఉద్యోగాల గురించి మీకేదైన సందేహం ఉన్న యెడల క్రింద పొందుపరచిన Comment బాక్స్ నందు మమ్మల్ని సంప్రదించగలరు.

Exit mobile version